Prashanth Varma: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో ఫిక్స్! 1 y ago
టాలీవుడ్లో కొత్త కాంబినేషన్ సెట్ కాబోతోంది. హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కలిసి ఓ సినిమాకి పని చేయనున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్ లుక్ టెస్ట్‌లో పాల్గొననున్నారని సమాచారం. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో 'బ్రహ్మరాక్షస్' అనే ప్రాజెక్టు తెరకెక్కించనున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ మైథాలాజికల్ స్టోరీనే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చి, తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.